భారతీయ రైల్వేకు వెయ్యికోట్ల ఆదాయం తెచ్చిన తత్కాల్ టికెట్లు

Indian Railways Earned Over 1000 Crore Rupees From Tatkal Scheme

భారతీయ రైల్వేకు తత్కాల్ టికెట్ల రూపేణా వెయ్యికోట్ల ఆదాయం సమకూరింది. అది కూడా మాములు పరిస్థితుల్లో కాదు, కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలో ఇంత ఆదాయం సమకూరటం నిజంగా అద్భుతమైన విషయం. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు.. ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు.. డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు.. మొత్తం ఆదాయం 1033కోట్లు రావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి కారణంగా గత సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయినాసరే, ఇంతపెద్ద మొత్తం ఆదాయంగా వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ రైల్వే ఆదాయంపై దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ