పీఎం మోదీతో సీఎం జగన్‌ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్. చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్‌ కి తనని కలిసే అవకాశం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ సమావేశంలో వ్యక్తిగత సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు పోలవరం, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ను కూడా కలుసుకున్నారు సీఎం జగన్‌. అలాగే, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతోనూ రేపు ఉదయం సమావేశం అవనున్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడంతో ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రధాని మోదీని కలిసిన వారిలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =