కరోనా బారిన పడిన మేఘాలయ ముఖ్యమంత్రి

దేశంలో కరోనా థర్డ్​వేవ్​ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తాజాగా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా ట్విట్టర్ ​ద్వారా ధ్రువీకరించారు. ‘కొన్ని రోజులుగా అస్వస్థతగా ఉండటంతో.. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. దీనిలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్​లో ఉన్నాను’ అని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు తమకు ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం వైద్యపరీక్షలు చేయించుకోవాలని సంగ్మా సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =