ఈ మధ్యే కొత్తగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఒక డిమాండ్ వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా తేవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగుసార్లు జరిగిన మేడారం జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. 332.71 కోట్లు నిధులను విడుదల చేశారని కవిత చెప్పారు.
మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పలుమార్లు కోరినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ హోదాతో పాటు ప్రత్యేక నిధులు కూడా కేటాయింపచేయాలని బండి సంజయ్ ని ఆమె డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం నిధులు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF