“కొవాగ్జిన్‌” వ్యాక్సిన్‌ : నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

Bharat Biotech Covaxin Vaccine, Coronavirus Vaccine COVAXIN, Covaxin Clinical Trials, Covaxin Clinical Trials Started In NIMS Hospital, Covaxin Vaccine, Covaxin Vaccine Clinical Trials, Covaxin Vaccine Clinical Trials Started at Nims Hospital, Hyderabad

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్‌” పేరుతో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ ను మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

కాగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఫేజ్-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను జూలై 15 న ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొత్తం 375 మందితో ఫేజ్-1 క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు ఇటీవలే భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆస్పత్రిలో కూడా ఈ రోజు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ డోస్‌ ఇచ్చినట్టుగా తెలిపారు. మరోవైపు దేశంలో మొత్తం 12 సెంటర్లలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 19 =