దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 172.61 కోట్లకుపైగా (1,72,61,59,520) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 11 కోట్లకు పైగా (11,17,06,742) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరోవైపు దేశంలో ఫిబ్రవరి 22, మంగళవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 175.83 కోట్లు (1,75,83,27,441) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 35.50 లక్షలకు (35,50,868) పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ