రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 265 ఖైదీలకు కరోనా

265 Prisoners at Rajahmundry Central Jail Tests Positive for Coronavirus

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఆగస్టు 6, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం‌ పాజిటివ్ కేసుల సంఖ్య 196789 కు చేరింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్‌ జైలులో ఖైదీలు, స్టాఫ్ కూడా కరోనా బారిపడ్డారు. ముందుగా ఆగస్టు 1 న జైలులో 75 మందికి పరీక్షలు నిర్వహించగా, విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ గా తేలింది. అలాగే ఆగస్టు 2 న మరో 64 మందికి కరోనా పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాలతో ఆగస్టు 3 న మొత్తం 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 247 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఇప్పటికి 265 మంది ఖైదీలకు, 24 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు జైల్ సూపరింటెండెంట్‌ చెప్పారు. జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన 24 మంది జైల్‌ సిబ్బందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అలాగే 247 మంది ఖైదీలను బయట ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్య ఏర్పడే ఉన్నందున జైలులోనే ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =