టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కొత్తగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు

TSRTC Establishing Nursing College In Tarnaka Hospital Starts From This Academic Year, TSRTC Establishing Nursing College In Tarnaka Hospital, Nursing College In Tarnaka Hospital, TSRTC Establishing Nursing College, Nursing College, Tarnaka Hospital, TSRTC, Nursing College In Tarnaka Hospital Starts From This Academic Year, Telangana State Road Transport Establishing Nursing College In Tarnaka Hospital Starts From This Academic Year, Telangana State Road Transport Establishing Nursing College In Tarnaka Hospital, TSRTC Establishing Nursing College In Tarnaka Hospital, Nursing College In Tarnaka Hospital Latest News, Nursing College In Tarnaka Hospital Latest Updates, Nursing College In Tarnaka Hospital Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో “టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాల” ను ప్రారంభించబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. తార్నాక ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాలను నెలకొల్పేందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుమతిని మంజూరు చేసిందని, ఈ విద్యా సంవత్సరం (మార్చి-2022) నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. తార్నాక ఆసుపత్రిలో స్వంత వనరులతో నర్సింగ్ కళాశాలను స్థాపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన దరిమిలా ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అన్ని నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కళాశాలకు అనుమతి ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

ప్రతి ఏటా 50 సీట్లతో టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ఆరంభం అవుతుందని, 30 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరో 20 సీట్లు మేనేజ్ మెంట్ కోటా కింద ఉంటాయని తెలిపారు. జంట నగరాల నడిబొడ్డున నెలకొల్పుతున్న ఈ కళాశాలలో వృత్తిపరమైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలల వంటి అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇక్కడ వైద్య సేవల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తార్నాక ఆసుపత్రిలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక్కడ మౌలిక వసతులను అభివృద్ధి పరిచే దిశలో కూడా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ సర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు లేదా ఇతర సందేహాల కోసం,టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 68153333, 040-30102829లో సంప్రదించవచ్చని లేదా www.tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ను చూడవచ్చని, లేదంటే నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్ ను నేరుగా సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ