ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పరిస్థితి విషమించడంతో చంద్రశేఖర్ రాజును విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కురుపాం మండలం చినమేరంగి కోటకు తరలించి ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/150ABmt8uM
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
చంద్రశేఖర్ రాజు టీడీపీలో ఒకప్పుడు క్రియాశీలకంగా పనిచేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. దీంతో శత్రుచర్ల ఇకలేరని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ రాజు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంతాపం ప్రకటించారు. ఈమేరకు లోకేష్ తన ట్విట్టర్ ద్వారా శత్రుచర్ల మృతికి సంతాపం తెలియజేశారు. కాగా టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడైన చంద్రశేఖర్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వయాన మామ కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ