ఏపీలో మే చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి – మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Minister Adimulapu Suresh Announces 40000 Tidco Houses To be Completed by End of May in AP, Adimulapu Suresh Announces 40000 Tidco Houses To be Completed by End of May in AP, 40000 Tidco Houses To be Completed by End of May in AP, Minister for Municipal Administration and Urban Development Audimulapu Suresh, Urban Development Minister Audimulapu Suresh, Municipal Administration Minister Audimulapu Suresh, 40000 Tidco Houses, 40000 Tidco Houses In AP, AP Tidco Houses, AP Tidco Houses News, AP Tidco Houses Latest News, AP Tidco Houses Latest Updates, AP Tidco Houses Live Updates, Audimulapu Suresh, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని మున్సిపల్‌ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అలాగే డిసెంబర్‌ నాటికి 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. వెలగపూడి తాత్కాలిక ప్రభుత్వాసుపత్రిలోని తన ఛాంబర్‌లో.. సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ.. మే నెల చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నామని వెల్లడించారు.

మే నెలాఖరుకి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సురేష్ తెలిపారు. తాగునీరు, మురుగునీటి పారుదల, మురుగునీటి శుద్ధి కర్మాగారం పనులు పూర్తయిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయడంతో పాటు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు అదనంగా రూ.4,200 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల స్థితిగతులను సమీక్షించి 81,000 ఇళ్లకు సంబంధించి నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టిపి), రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. ఇక నుంచి ప్రతివారం ఒకసారి టిడ్కో పనులను సమీక్షిస్తానని మంత్రి తెలిపారు.

దశలవారీగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందని, ఈ ఏడాది చివరి నాటికి పెద్ద మొత్తంలో ఇళ్లను నిర్మించి అందించటానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. మొదటగా మే చివరి నాటికి దాదాపు 40,000 ఇళ్లు, ఆ తర్వాత జూన్ నాటికి 90,000కు పైగా ఇళ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఆపై సెప్టెంబర్ నాటికి 65,000 ఇళ్లు, చివరిగా డిసెంబర్ నాటికి మరో 65,000 ఇళ్లు పూర్తవుతాయని ప్రకటించారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 2.62 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని సురేష్ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =