జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం గుంటూరు పాత నగరంలోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ శతాబ్ది వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పవన్ కళ్యాణ్ కు అమ్మవారి ప్రసాదంతోపాటు ఆశీర్వచనాలు అందచేశారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి అమ్మవారి శతాబ్ది ఉత్సవ వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ కి ఆలయ కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఐదు రోజుల పాటు జరగనున్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఈ రోజే అంకురార్పణ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY