ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.6756.92 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన బిల్లులను ఒక నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ మంత్రిత్వ శాఖ, దాని విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎనిమిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమంయంలో జూన్ 2, 2014 నుండి జూన్ 10, 2017 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. అయితే ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు అప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని సీఎం జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో.. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై రూ.3,441.78 కోట్ల ప్రిన్సిపల్ మరియు ఆలస్య చెల్లింపు సర్‌చార్జ్ రూ.3,315.14 కోట్లు (జూలై 31, 2022 వరకు)తో సహా తెలంగాణ బకాయిలను క్లియర్ చేయలేదని ఇచ్చిన వివరణపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఆగస్టు 29 నుంచి 30 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని ఆదేశించింది. ఇరు రాష్ట్రాలకూ అవతలి పక్షం యొక్క విధి విధానాలను గౌరవించాల్సిన సమాన బాధ్యత కలిగి ఉంటుందని, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జారీ చేయబడిన భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం, ఏపీకి విద్యుత్ బకాయిలను చెల్లించాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY