దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో జరిగాయి. లక్షల మంది బ్రిటన్ పౌరులు అశ్రునయనాలతో తమ ప్రియతమ రాణికి తుది వీడ్కోలు పలికారు. ముందుగా క్వీన్స్ శవపేటిక వెల్లింగ్టన్ ఆర్చ్ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో బ్రిటిష్ జాతీయ గీతం ఆలపించబడింది. రాణి కుటుంబంతో సహా హాజరైన ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. వీరందరి సమక్షంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ క్రమంలో వెస్ట్‌మినిస్టర్ అబ్బే చర్చిలో ప్రార్ధనలు చేసే సమయంలో 96 సార్లు మోగించారు. క్వీన్ ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలకు గుర్తుగా 96 సార్లు గంటను మోగించారు. అనంతరం రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజీలో రాణి భౌతికకాయాన్ని విండర్స్ కాజిల్ కు తరలించారు. కాగా ఈ క్యారేజీని 1979లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ మౌంట్ బాటన్ అంత్యక్రియల్లో ఉపయోగించారు. ఆ తర్వాత దీనిని ఉపయోగించడం మళ్ళీ ఇదే తొలిసారి కావడం విశేషం.
రాణి శవపేటికతోపాటు కింగ్ అండ్ క్వీన్ కన్సార్ట్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ మరియు ఇతర రాజకుటుంబ సభ్యుల కారు ఊరేగింపుగా వెస్ట్‌మినిస్టర్ అబ్బే చేరుకుంది. ఇక చివరిగా రాణి కుటుంబంతో పాటు సన్నిహితుల సమక్షంలో క్వీన్ ఎలిజబెత్-2కి వీడ్కోలు పలికి ఖననం చేశారు. గతేడాది మరణించిన రాణి భర్త ఫిలిప్ సమాధి పక్కన ఆమెను ఖననం చేయడం గమనార్హం. కాగా బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన ఆమెకు వీడ్కోలు పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నాయకులు లండన్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దాదాపు 2 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌లో కింగ్ చార్లెస్-3ని కలుసుకుని దేశం తరపున సంతాపం వ్యక్తం చేశారు. లాంకాస్టర్ హౌస్‌లో హర్ మెజెస్టి ది క్వీన్ ఎలిజబెత్-2 జ్ఞాపకార్థం సంతాప పుస్తకంపై సంతకం చేశారు.
President Droupadi Murmu signed the Condolence Book in the memory of Her Majesty the Queen Elizabeth II at Lancaster House, London. pic.twitter.com/19udV2yt0z
— President of India (@rashtrapatibhvn) September 18, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY