తెలంగాణ ఐసెట్-2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల, వివరాలు ఇవే…

Telangana ICET-2022 Counseling Schedule Released, Telangana ICET-2022 Counseling, Telangana ICET-2022 Counseling Schedule, Telangana ICET-2022, TS ICET-2022 Counseling, TS ICET-2022 Schedule, TS ICET-2022 Counseling Schedule, Mango News, Mango News Telugu, TS ICET-2022, TS ICET-2022 Results, TS ICET Counselling 2022 Dates Released, TS ICET Web Counselling Schedule, Telangana TS ICET Counselling 2022, TS ICET 2022 Latest News And Updates

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టీఎస్ ఐసెట్-2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ అక్టోబర్ 8వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రెండు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. ముందుగా తెలంగాణలో ఐసెట్-2022 ప్రవేశ పరీక్షను జూలై 27, 28వ తేదీల్లో నిర్వహించగా, ఆగస్టు 27న ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ పరీక్షకు మొత్తం 68,781 మంది విద్యార్థులు హాజరుకాగా, 61,613 మంది అభ్య‌ర్థులు అర్హ‌త సాధించారని, 89.57 శాతం ఉత్తీర్ణ‌త నమోదైందని తెలిపారు.

టీఎస్‌ ఐసెట్-2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – అక్టోబర్ 8 నుంచి 12 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – అక్టోబర్ 10 నుంచి 13 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – అక్టోబర్ 10 నుంచి 15 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ ఫ్రీజింగ్ – అక్టోబర్ 16
  • ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయింపు – అక్టోబర్ 18
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – అక్టోబర్ 18 నుంచి 22 వరకు

తుది విడత:

  • తుది విడత ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం – అక్టోబర్ 23
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ అక్టోబర్ 23 నుంచి 25 వరకు
  • తుది విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయింపు – అక్టోబర్ 28
  • స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు – అక్టోబర్ 28.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twenty =