కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ పాదయాత్ర అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుండగా, ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర విజయవంతం చేసేందుకు రిసెప్షన్ కమిటీ సహా మరో 13 రకాల పర్యవేక్షణ కమిటీలను తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కమిటీలలో సీనియర్లు అందరికీ స్థానం కల్పించారు. ఒక్కో కమిటీకి చెందిన చైర్మన్, కన్వీనర్ మరియు సభ్యుల వివరాలను వెల్లడించారు. ఆయా కమిటీలు వెంటనే సమావేశాలు నిర్వహించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పర్యవేక్షణ కమిటీల వివరాలివే:
- కల్చరల్ కమిటీ: భట్టి విక్రమార్క (చైర్మన్), అంజన్ కుమార్ యాదవ్ (కన్వీనర్)
- ఇంటరాక్షన్ విత్ సోషల్ ఎమినెంట్ పర్సన్స్, ఎన్జీవోస్, ప్రొఫెషనల్స్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి (చైర్మన్), మధుయాష్కీ గౌడ్ (కన్వీనర్)
- పబ్లిసిటీ కమిటీ : దామోదర్ సీ రాజనర్సింహ (చైర్మన్), కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కె.మదన్ మోహన్ (కన్వీనర్)
- కోఆర్డినేషన్ విత్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ : డి.శ్రీధర్ బాబు (చైర్మన్), మల్లు రవి (కన్వీనర్)
- కార్నర్ మీటింగ్స్ కమిటీ : సంపత్ కుమార్ (చైర్మన్), అజ్మతుల్లా హుస్సేనీ, ఎం.ఆర్.జీ వినోద్ రెడ్డి (కన్వీనర్)
- ఫుడ్ కమిటీ : షబ్బీర్ అలీ (చైర్మన్), ఎంఎస్ రాజ్ ఠాకూర్ (కన్వీనర్)
- మొబిలైజేషన్ కమిటీ : ఎ.మహేశ్వర్ రెడ్డి (చైర్మన్), సౌదాగర్ గంగారాం (కన్వీనర్)
- ప్రోటోకాల్ కమిటీ : జీ.వినోద్ (చైర్మన్), వేణుగోపాల్ రావు, జగదీశ్వర్ రావు (కన్వీనర్)
- మీడియా కమిటీ : జెట్టి కుసుమ కుమార్ (చైర్మన్), బి.అయోధ్య రెడ్డి (కన్వీనర్)
- విమెన్ మొబిలైజేషన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ : డి అనసూయ (సీతక్క) (చైర్మన్), ఎన్.పద్మావతి రెడ్డి (కన్వీనర్)
- స్టేట్ యాత్రిస్ కోఆర్డినేషన్ కమిటీ : పొన్నం ప్రభాకర్ (చైర్మన్), సురేష్ కుమార్ షెట్కార్ (కన్వీనర్)
- సోషల్ మీడియా కమిటీ : గడ్డం ప్రసాద్ కుమార్ (చైర్మన్), మన్నే సతీష్ కుమార్ (కన్వీనర్)
- లాజిస్టిక్ కమిటీ : టీ.రామ్మోహన్ రెడ్డి (చైర్మన్), దొంతి మాధవ్ రెడ్డి (కన్వీనర్).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY