సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా, పండుగ అడ్వాన్స్‌, దీపావళీ బోనస్‌ కలిపి ఒక్కొక్కరికి రూ.1.15 లక్షలు

29 Percent Profit Sharing Bonus to Singareni Employees, Bonus to Singareni Employees, CM KCR Announces 29 Percent Profit Sharing Bonus to Singareni Employees, Dussehra Advance and Diwali Bonus, Dussehra Advance and Diwali Bonus To Dussehra Advance and Diwali Bonus, Mango News, Singareni, Singareni Collieries, Singareni Collieries staff, Singareni Employees, Singareni employees to get a total of Rs 1.15 lakh, Singareni Employees to Get a Total of Rs 1.15 Lakh as Profit Share, telangana

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాభాల వాటాతో పాటుగా కార్మికులు, ఉద్యోగులకు అందించే పండుగ అడ్వాన్స్‌, దీపావళీ బోనస్‌ వివరాలను సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ బుధవారం నాడు ప్రకటించారు. ఈ ఏడాది లాభాల్లో 29 శాతం వాటా కింద రూ.79.07 కోట్లను చెల్లించనున్నామని, ఈ మొత్తాన్ని కార్మికులకు అక్టోబర్ 11న చెల్లించనున్నట్టు తెలిపారు. అలాగే పండుగ అడ్వాన్స్‌ కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అక్టోబర్ 8వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమచేస్తామన్నారు.

ఇక దీపావళి బోనస్‌ కింద రూ.300 కోట్లు ప్రకటించామని, ఒక్కో కార్మికుడికి రూ.72,500 నగదును నవంబర్‌ 1వ తేదీన చెల్లించనున్నట్టు తెలిపారు. లాభాల వాటా, పండుగ అడ్వాన్స్‌, దీపావళీ బోనస్‌ మూడూ కలిపి ఒక్కో కార్మికుడు సగటున సుమారు రూ.1.15 లక్షల వరకు అందుకోనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =