భారత్ జోడో యాత్రను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆపాలని చూస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కోవిడ్ హెచ్చరిక లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. కాగా భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్కులు మరియు శానిటైజర్‌లను ఉపయోగించాలని, కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఒకవేళ అలా కుదరని పక్షంలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దానిని వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ లేఖలో కోరడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం హర్యానాలో జరిగిన ర్యాలీ సందర్భంగా దీనిపై మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, దీనిని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రం తనని ఆపడానికి రకరకాల కారణాలు చెబుతోందని, యావత్ భారతదేశం వారి పాలనపై వినిపించే సత్యం గురించి తెలుసుకోవడానికి వారు ఇష్టపడటం లేదని మండిపడ్డారు. కరోనా వైరస్ యొక్క కొత్త తరంగం దేశాన్ని తాకవచ్చు కాబట్టి యాత్రను నిలిపివేయమని వారు నాకు లేఖ రాశారు. అయితే ఇవన్నీ కేవలం సాకులు మాత్రమేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ