జూలై 26 న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు నివేదికలను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన సంబంధిత ఇంచార్జ్ లు అందించిన నివేదికలను సవివరంగా పరిశీలించిన తరువాత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గజ్వెల్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో 93వేల మంది సభ్యత్వం తీసుకున్నట్టు ప్రకటించారు. 80వేలతో పాలకుర్తి నియోజకవర్గం రెండోస్థానంలో నిలవగా, సిద్దిపేట్, సిరిసిల్ల,ఖమ్మం, హుజూర్ నగర్, మరో 15 కు పైగా నియోజక వర్గాల్లో 50,000 పైగా కొత్త సభ్యుల నమోదు జరిగిందని ప్రకటించారు. సభ్యత్వ గడువును జూలై 30 వరకు పొడిగించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వచ్చిందని, నెల రోజుల్లో 60 లక్షల మంది సభ్యులుగా చేరడం దేశ చరిత్రలో అరుదని చెప్పారు. త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికలను పార్టీ నాయకులు సిద్ధం అవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల లాగానే అన్నిచోట్లా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పార్టీ కమిటీలను నియమించాలని ఆదేశించారు, పురపాలిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అసలు ఉండదని, బీజేపీ ఎంపీలు ఉన్న ఛోట్ల అప్రమత్తంగా ఉండాలని నాయకులకు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించిన వాళ్లే మునిసిపల్ ఎన్నికలకు బాధ్యతలు వహిస్తారని తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=vKT87R_bKMo]