ఎపిసోడ్ 6 (జూలై26) హైలైట్స్: కళాకారులం స్కిట్, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా గొడవ కొనసాగింపు

Arguments between Varun Sandesh and Mahesh Vitta, Bigg Boss 3 Telugu EPISODE 6 Highlights, Bigg Boss Episode 6 Latest News, Bigg Boss Season 3 Telugu Episode 6 Main Highlights, Bigg Boss Telugu 3 fight between Varun Sandesh and Mahesh Vitta, Varun Sandesh has an ugly spat with Mahesh

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 26న ప్రసారమైన బిగ్ బాస్ 3 ఆరో ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్, మహేష్ విట్టా మధ్య గొడవ కోనసాగింది, చాలాసేపు వివరణల తరువాత సారీ తో ముగిసింది. కళాకారులం స్కిట్ తో సభ్యులు ఆకట్టుకున్నారు.

ఎపిసోడ్ 6 (జూలై26) హైలైట్స్: కళాకారులం స్కిట్, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా గొడవ కొనసాగింపు

 • శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభం అయ్యాక, హేమ-సింగర్ రాహుల్ మధ్య రెండురోజుల క్రితం మొదలైన వాదన కొనసాగుతూనే ఉంది, హేమ క్షమాపణ చెప్పాలనే విషయంలో రాహుల్ వెనక్కి తగ్గడం లేదు
 • ఇక వరుణ్ సందేశ్-మహేష్ విట్టా మధ్య మొదలైన గొడవ నిన్న తారాస్థాయికి చేరింది, చెల్లెలుగా భావించి చనువుతోనే పో అన్నానని మహేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన, వరుణ్ సందేశ్, వితికాలు సారీ చెప్పాలనే పట్టుబట్టారు. కొంతమంది ఇంటి సభ్యులు కూడ వారికే సపోర్ట్ చేసారు
 • తన మాటతీరు వలన అలా అనిపించి ఉండొచ్చని, తన తప్పు ఉన్నా లేకున్నా సారీ చెప్తానని మహేష్ అనగా అలా చెప్పే సారీ తనకు వద్దని వితికా మళ్ళీ గొడవకి దిగింది
 • తగ్గి మాట్లాడుతున్న కూడ మీరు నన్ను పట్టించుకోవడం లేదని మహేష్ విట్టా కోప్పడడంతో మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చింది, మొన్న జరిగిన చిన్న పిల్లల టాస్క్ లో మహేష్ వ్యాఖ్యలను గుర్తుచేసి వరుణ్ సందేశ్ వాదనకు దిగారు, చివరికి మహేష్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది
 • తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కళాకారులం మేం కళాకారులం స్కిట్ చేయమని చెప్పి, రెండు టీములుగా విడగొట్టారు
 • శ్రీముఖి స్కూల్లో రోహిణి, హేమ, రవికృష్ణ, వరుణ్, వితికా, అషు, పునర్నవి ఉన్నారు
 • బాబాబాస్కర్ స్కూల్లో అలీరేజా, మహేష్ విట్టా, రాహుల్, జాఫర్, సావిత్రి, హిమజ ఉన్నారు
 • రవికృష్ణ,రోహిణి స్టెప్పులతో అలరించారు, హేమ శ్రీముఖి కూడ టాస్క్ సరదాగా చేసారు
 • రైతుగా మహేష్ విట్టా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు, తన టీం సభ్యులు రాహుల్, జాఫర్, సావిత్రి, హిమజ, అలీరేజా, బాబాబాస్కర్ కూడ తమదైన శైలిలో హార్ట్ టచింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు
 • సింగర్ రాహుల్, శ్రీముఖి వారి మధ్య జరిగిన విషయం గురించి కాసేపు మాట్లాడుకున్నారు
 • గొడవతో మొదలైన ఎపిసోడ్, తరువాత జరిగిన స్కిట్ తో సరదాగా ముగిసింది
 • ఎలిమినేషన్స్ ఉండడం, నాగార్జున రానున్న నేపథ్యంలో శనివారం ఎపిపోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here