బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో పలుచోట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాష్ట్రమంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలకు గానూ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగల బెట్టారు. అలాగే కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బండి సంజయ్ వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ఈడీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈడీ కార్యాలయం ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE