ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో ప్రభుత్వం చేపపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధానంగా సంతబొమ్మాళి మండలం మూలపేటలోని భావనపాడు పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పోర్టు నిర్వాసిత కాలనీ, ఫిషింగ్ హార్బర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తదితర పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, ట్రాఫిక్ మళ్లింపులు, సీఎం జగన్ ప్రయాణించే వివిధ ప్రదేశాల్లో పటిష్ట బందోబస్తు, వీవీఐపీ వాహనాల పార్కింగ్, ప్రజా వాహనాలు, నౌపాడలో బహిరంగ సభ వేదిక భద్రత, హెలిప్యాడ్ భద్రత తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్ష జరిపి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వివిధ కేడర్‌ల పోలీసు అధికారులకు వేర్వేరు విధులను కేటాయించారు మరియు వివిధ భద్రతా విభాగాలకు సిబ్బందిని కూడా కేటాయించారు.
సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇలా..
- రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
- అక్కడినుంచి బయలుదేరి ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 9:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు.
- 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన మరియు గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- 11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారు.
- దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
- 11.40 – 12.30 గంటల మధ్య అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
- అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
- అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE