త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా.. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ

Former Team India Cricket Captain and Ex-BCCI Chief Sourav Ganguly Roped in as Brand Ambassador of Tripura Tourism,Former Team India Cricket Captain as Brand Ambassador,Sourav Ganguly Roped in as Brand Ambassador of Tripura Tourism,Ex-BCCI Chief Sourav Ganguly,Brand Ambassador of Tripura Tourism,Mango News,Mango News Telugu,Sourav Ganguly Latest News,Sourav Ganguly Latest Updates,Tripura Tourism,Tripura Tourism Latest News,Tripura Tourism Latest Updates,Tripura Tourism Live News

భారత క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్‌ సౌరవ్ గంగూలీ త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా నియమితులయ్యారు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనను ఆయన అంగీకరించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. కాగా అంతకుముందు త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సౌరవ్ గంగూలీని కోల్‌కతా, బెహలాలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రతిపాదించారు. అలాగే సీఎం సాహా కూడా గంగూలీతో టెలిఫోనిక్ సంభాషణ జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా వారి ప్రతిపాదనకు సౌరవ్ గంగూలీ ఆమోదం తెలిపారు. ఇక త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే మా ప్రతిపాదనను సౌరవ్ గంగూలీ అంగీకరించడం చాలా గర్వించదగిన విషయమని, ఈరోజు ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, గంగూలీ భాగస్వామ్యం ఖచ్చితంగా రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని విశ్వసిస్తున్నామని త్రిపుర సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే సౌరవ్ గంగూలీ వచ్చే నెల ప్రారంభంలో విదేశీ పర్యటకు వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆయన జూన్‌ చివరిలో త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు సౌరవ్ గంగూలీని త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్ టూరిజం అంబాసిడర్‌గా నియమించనందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. గంగూలీని త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం మనందరికీ గర్వకారణం, కానీ బెంగాల్‌ను గర్వించేలా చేసిన గంగూలీని మమతా బెనర్జీ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయకపోవడం దురదృష్టకరం అని బీజేపీ బెంగాల్ యువమోర్చా అధ్యక్షుడు ఇంద్రనీల్ ఖాన్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =