అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర, వైట్‌ హౌస్‌పై దాడికి యత్నం.. పట్టుబడ్డ తెలుగు సంతతి యువకుడు

Indian-Origin Teen Arrested For Conspiracy To Assassin US President Joe Biden by Crashing Truck Near White House,Indian-Origin Teen Arrested For Conspiracy,Conspiracy To Assassin US President Joe Biden,Teen Arrested For Crashing Truck Near White House,Mango News,Mango News Telugu,Assassin US President Joe Biden,US President Joe Biden,Indian-Origin,Teen Arrested For Conspiracy,Teen crashes into White House barriers,White House truck crash,White House truck crash Latest News,White House truck crash Latest Updates,US President Joe Biden Latest News,US President Joe Biden Latest Updates,US President Joe Biden Live News

అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన ఒక తెలుగు సంతతి యువకుడు పట్టుబడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి నాజీ జెండాతో కూడిన యు-హాల్ ట్రక్కుతో దూసుకొచ్చిన ఓ యువకుడు బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కారు డ్రైవర్‌ను మిస్సోరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్ కందుల (19)గా గుర్తించినట్లు పార్క్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడిపై ర్యాష్‌ డ్రైవింగ్‌, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడిని చంపడానికి లేదా హాని చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10:00 గంటలకు ముందు లాఫాయెట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్‌లలోకి డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా దూసుకొచ్చాడని, అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పార్క్ పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో పార్క్ పోలీస్ మరియు సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రక్కు వద్దకు రావడంతో నాజీ జెండాతో ట్రక్కు దిగిన సాయివర్షిత్‌ అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా సాయివర్షిత్‌ కందుల అమెరికాలోని మిస్సోరి స్టేట్‌ చెస్ట్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూల్‌ నుంచి అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఇటీవల మిస్సోరి నుంచి వాషింగ్టన్‌ డీసీకి ఫ్లైట్‌లో వచ్చిన సాయివర్షిత్‌ వచ్చీరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో మొదటి బారికేడ్‌ వద్దనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ విషయాన్ని అధికారులు మంగళవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ప్రమాదంపై మంగళవారం ఉదయం అమెరికా బైడెన్‌కి వివరించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు. ఇక యూఎస్ నిఘా వర్గాలు సాయివర్షిత్‌ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అతని సన్నిహితుల ద్వారా మరియు సోషల్‌మీడియా అకౌంట్స్‌ ద్వారా అతనికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా శోధిస్తున్నారు. ఇంతుకుముందు అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా? అతనిపై ఏమైనా క్రిమినల్ కేసులు వంటివి ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =