లక్షలాదిగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (గురువారం, మే 25, 2023) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రేపు ఉదయం 9:30 గంటలకు ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జేఎన్‌టీయూహెచ్‌లో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఎంసెట్ ఛైర్మన్ కట్టా నర్సింహా రెడ్డి, కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలకు సంబంధించిన ర్యాంకులు మరియు మార్కులను మంత్రి విడుదల చేస్తారని వివరించారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
కాగా ఈ పరీక్షల్లో తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్‌లో 92.50% హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో 97% మంది విద్యార్థులు టీఎస్ ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు 12, 13, 14 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలు అనుమతించబడతాయని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది మొత్తం 3,20,683 మంది విద్యార్థులు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, 3,01,789 మంది పరీక్షకు హాజరయ్యారు. 94.11% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలను 1,95,275 మంది రాయగా.. అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE