కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించి..జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ జాబిల్లి మీద అడుగు మోపింది.చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది.
అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది. అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. దీనితో అప్పటివరకు పిన్ డ్రాప్ సైలెంట్‌గా కనిపించిన ఇస్రో మిషన్ కాంప్లెక్స్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించడంతో యావత్ భారత దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది.
అయితే ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫోటోలను ఇస్రో విడుదల చేయడంతో ఇప్పటికీ అవి తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని తన అధికారిక ఎక్స్ ప్లాట్‌ఫారమ్ లో పోస్ట్ చేసింది. దక్షిణ ధృవానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అవి. ల్యాండర్‌కు అమర్చిన హారిజాంటల్ వెలాసిటీ కెమెరా వీటిని క్లిక్ మనిపించింది.
ఈ ఫొటోలను బెంగళూరులో గల ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మిషన్ ఆపరేషన్స్ సెంటర్‌కు పంపించింది. ఈ ఫోటోలు రావడంతో.. ఇక విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్‌తో పూర్తిస్థాయిలో కనెక్టివిటీనీ సాధించినట్లు ఇస్రో తెలిపింది. రెండు వైపుల నుంచి కనెక్ట్ ఏర్పడిందని, తాము పంపించిన సిగ్నల్స్ మాత్రమే కాకుండా,ల్యాండర్ కూడా తన డేటా, ఫొటోలను పంపించగలుగుతోందని పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE