చంద్రయాన్‌-3 ఊపుతో సూర్యుడిపై కన్నేసిన ఇస్రో..

ISRO Plans To Launch Solar Mission Aditya in September After Grand Success of Chandrayan 3,ISRO Plans To Launch Solar Mission,Solar Mission Aditya in September,After Grand Success of Chandrayan 3,Mango News,Mango News Telugu,Prachanda decided to study Bhanu. For this, ISRO has already taken up the Aditya L-1 project, ISRO eyed the sun with the momentum of Chandrayaan 3,Solar Mission Launch Latest News,Solar Mission Launch Latest Updates,Chandrayan 3 Latest News,Chandrayan 3 Latest Updates

కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించి, చివరకు చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.

ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. భగభగమండే సూర్యుడిపై కన్నేసింది. ప్రచండ భానుడిపై అధ్యయనం చేయడానికి సంకల్పించింది. దీనికోసం ఇదివరకే ఆదిత్య ఎల్-1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది ఇస్రో. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకుని రాబోతోంది.

సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1‌ను ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 మిషన్ త్వరలో పట్టాలెక్కిస్తామని, సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ప్రయోగించిన రోజు నుంచి ఈ మిషన్ సూర్యుడిని సమీపించడానికి సుమారు 120 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సోమనాథ్ తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను దీనికోసం వినియోగిస్తామని వివరించారు. ఇప్పటికే ఈ రాకెట్, శాటిలైట్ బెంగళూరులోని యూఆర్ రావు సెంటర్ నుంచి శ్రీహరికోటకు చేరుకుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =