ఏపీలో వైసీపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పావులు కదుపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జెండా ఎగురవేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఇటీవలకాలంలో కొందరు జనసేన, టీడీపీ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. తమ పొత్తుపై ఎంతటి స్థాయి నాయకులు మాట్లాడినా ఏమాత్రం సహించేది లేదన్నారు. వారిపై గట్టి చర్యలు తీసుకుంటామని.. వారిని వైసీపీ కోవర్టులుగా భావిస్తామని హెచ్చరించారు.
కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే పొత్తుకు కొందరు తూట్లు పొడవాలనుకుంటున్నారని పవన్ భగ్గుమన్నారు. కానీ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో.. పవన్ కళ్యాణ్కో పొడిచినట్లు కాదన్న పవన్.. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లని అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రానికి మేలు జరిగేలా.. ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా.. ప్రజలు బాగుపడేలా నిర్ణయం తీసుకుంటానన్నారు. తన నిర్ణయాలను సందేహించేవారు వైసీపీలోకి వెళ్లిపోవచ్చని పవన్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లామని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు వచ్చి తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారంటే వాళ్లు తగ్గారని కాదన్న పవన్.. పార్టీ అవసరాన్ని గుర్తించారని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్రియలో ఎవరినైనా గౌరవించాలని.. టీడీపీతో పొత్తులోనూ అదే సూత్రం వర్తిస్తుందన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా జనసేన నేతలు ఎవరు మాట్లాడినా సహించేది లేదని పవన్ హెచ్చరించారు. వైసీపీ కులం పేరుతో ట్రాప్ చేస్తోందని.. కులాన్ని మోసం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాన్ అన్నారు. ఒకే ఒక కులాభిమానంతో రాజకీయ ప్రస్థానం సాధ్యం కాదన్న పవన్.. వైసీపీ కులం ట్రాప్లో ఎవరూ పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE