ఈ ఎన్నికల ఫలితాలలో వారికి షాక్ తప్పదా?

Is it difficult for the ministers to win,Is it difficult for the ministers,the ministers to win,ministers win, election, key leader,Khammam, Muslims, votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls
ministers win, election, key leader,Khammam, Muslims, votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, Congress,

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసిపోయిన వెంటనే వెలువడిని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు  దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. దాదాపు అన్ని పోల్స్.. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాతుందని స్పష్టం చేయడంతో ఈ సారి కారు పార్టీకి ఓటమి తప్పదన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా  20 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విడుదల కాగా.. అందులో  17సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి.

ఇదే సమయంలో  తెలంగాణ  వ్యాప్తంగా పోటీ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు  గెలుస్తారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  తెలంగాణ  వ్యాప్తంగా పోటీ చేసిన మంత్రివర్గంలో ఉన్న చాలామంది మంత్రులు ఓడిపోతారన్న టాక్  తెలంగాణలో ఇప్పుడు బాగా వినిపిస్తుంది.చివరకు మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురు మంత్రులు గెలిస్తే అదే పండుగ  అన్నట్టు పరిస్థితి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మంత్రివర్గంలో  మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ కచ్చితంగా గెలుస్తారని  కానీ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మంత్రులు చాలా మంది ఓడిపోవడం ఖాయమనే వార్తలు ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,  సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి  ఓడిపోవడం గ్యారంటీ అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

వీరిలో ఒకరిద్దరు మంత్రులు మాత్రం గెలుపోటముల మధ్య ఊగిసలాడుతున్నారనే వాదన వినిపిస్తుంది. చాలామంది మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కొన్ని ప్రాంతాలలో మంత్రులను అడ్డుకుని వారిని ప్రశ్నించడంతోనే వారిపై ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ అర్థం అయింది. అయితే ఇలా చేదు అనుభవాలు ఎదురయిన మంత్రులెవరూ తిరిగి ప్రజల మనసును గెలుచుకోలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.

ఇలా ప్రచార కార్యక్రమంలో వ్యతిరేకత ఎదురయిన మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారంటీ అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ మంత్రులతో పోటీ పడిన  బలమైన నేతలు ప్రత్యర్థులుగా ఉండగా.. మరి  కొన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలు లేకపోయినా కూడా అక్కడ ఈ మంత్రులు  గెలిచే పరిస్థితి లేదని వాదన వినిపిస్తోంది. సీఎం కేసీఆర్‌పై ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా కూడా..మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ప్రత్యర్ధి పార్టీలకే తమ ఓటును గుద్దినట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 3 న విడుదల కానున్న ఎన్నికల ఫలితాలలో ఈ నేతల తలరాతలు ఎలా ఉన్నాయో చూడాలన్న ఆసక్తి సర్వత్రా పెరిగిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − one =