తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్ ఇచ్చి ఓటమి పాలయింది గులాబీ పార్టీ. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనుకున్న కేసీఆర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ పరిణామాలను క్షణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్న వైసీపీ హైకమాండ్ అప్రమత్తమయింది. వచ్చే ఎన్నికల్లో తాము కూడా సిట్టింగ్‌లకు టికెట్ ఇస్తే.. ఓటమి తప్పదనే విషయాన్ని అధినాయకత్వం గ్రహించింది. అందుకే ఈసారి సిట్టింగ్‌ల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. దీంతో సిట్టింగ్‌లను ఎవరెవరిని తప్పించాలని.. వారి స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధిష్టానం సర్వే చేయించింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. వారికి మరోసారి టికెట్ ఇస్తే జనాదరణ ఉండదని.. ఓటమి ఖాయమని సర్వేలో స్పష్టమయింది. ఈక్రమంలో ఇప్పటికే 11 మంది సిట్టింగ్‌లను వైసీపీ హైకమాండ్ మార్చేసింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరో నలభై మంది సిట్టింగ్‌లకు అధిష్టానం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో అమర్నాథ్ స్థానంలో ఎంపీ సత్యవతిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుడివాడ అమర్నాథ్‌కు గాజువాక టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే భీమిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అవంతి శ్రీనివాసరావుని కూడా ఈసారి తప్పించే అవకాశం కనిపిస్తోంది. భీమిలీ టికెట్ కూడా ఈసారి కొత్త వ్యక్తికి ఇవ్వనున్నారని.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆ టికెట్ దక్కనుందని సమాచారం.
అటు పెందుర్తిలో కూడా ఈసారి కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజ్‌ను పక్కకు తప్పించి.. కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. పెందుర్తి స్థానం దక్కాలంటే.. సిట్టింగ్‌ను పక్కకు పెట్టాల్సిందేనని సర్వేలో తేలిందట. ఇక ఇదే సమయంలో పెందుర్తి టికెట్ మాజీ జెడ్పీటీసీ కంచిపాటి విశ్వనాధంకు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సీఎం జగన్‌తో కూడా విశ్వనాధం భేటీ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కడం ఖాయమని ఇప్పటి నుంచే విశ్వనాధం.. నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారట. ఇలా మొత్తం యాభై నుంచి ఆరవై మంది సిట్టింగ్‌లను షాక్ ఇచ్చే యోచనలో వైసీపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE