సీఎం జగన్‌ తో నీతి ఆయోగ్ బృందం భేటీ, ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్‌ అందజేత

Andhra Pradesh CM Y S Jaganmohan Reddy, Mango News, Niti Aayog Team, NITI Aayog Team Calls On Andhra CM YS Jagan, NITI Aayog team calls on AP CM, Niti Aayog Team Members, Niti Aayog Team Members Meet AP CM YS Jagan, Niti Aayog Team Members Meet AP CM YS Jagan at Tadepalli, sdg index by niti aayog, sdg index india 2021, sdg index report by niti aayog, Tadepalli

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో శుక్రవారం నాడు నీతి ఆయోగ్ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరగగా, సీఎంను కలిసిన వారిలో నీతి ఆయోగ్‌ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతి ఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతి ఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్‌ను సీఎంకు నీతి ఆయోగ్‌ బృంద సభ్యులు అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, పలు రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ముందుగా సచివాలయంలో ఏపీ ఉన్నతాధికారులతో నీతిఆయోగ్‌ సభ్యులు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్‌ 62వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు తెలిపారు. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌ కు స్పష్టం చేసింది. అలాగే మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =