ఊరిలోనే, ఇంకెక్కడో ఉన్న బైక్‌ను ఎక్కువ దూరం బైక్‌లను మనం ఉన్న చోటుకు తీసుకెళ్లడం కాస్త కష్టమే. ప్రైవేట్ పార్శిల్ కంపెనీల ద్వారా పంపుదామంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే ట్రైన్‌లో బైక్‌లను పార్శిల్ చేస్తే భద్రతకు భద్రత, పైగా ఖర్చు ఆదా అవుతుంది. బైక్ పేపర్స్ మన దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి.. బైక్ ను బరువు, దూరం ఆధారంగా పార్శిల్ ద్వారా రప్పించుకోవచ్చు.
ముందుగా దగ్గరలోని రైల్వే స్టేషన్‌కి వెళ్లాలి. అక్కడ బండిని రైలులో పంపడం గురించి స్టేషన్లో ఉన్న పార్శిల్ ఆఫీసులో వివరాలు అడగాలి.తర్వాత వాళ్లు ఇచ్చిన దరఖాస్తును ఫిల్ చేయాలి. దరఖాస్తును నింపేటప్పుడు మీ బైక్ ఆర్సీ బుక్, బీమా అసలైన సర్టిఫికేట్ మీ వద్ద ఉండాలి.
అలాగే ఆ సర్టిఫికెట్ల కాపీలను మీ దగ్గర ఉంచుకోవాలి. అక్కడి సిబ్బంది ఆ కాపీలను తనిఖీ చేసి బైక్ పార్శిల్ చేయడానికి అనుమతిస్తారు. మీరు ఎప్పుడు బైక్‌ను పంపాలనుకుంటున్నారో ఆ డేట్ ను మెన్షన్ చేయాలి. సాధారణంగా బైక్‌ను 500 కిలోమీటర్ల దూరానికి పంపడానికి రూ.1200 వరకు ఖర్చు అవుతుంది. కానీ బండి బరువు, దూరాన్ని బట్టి అది మారుతుంది.
అదేవిధంగా బైక్ ప్యాకింగ్ కు రూ. 300 నుంచి రూ. 500 ఖర్చవుతుంది. బైక్ పాడవకుండా పగడ్బంధీగా బైక్‌ను ప్యాక్ చేస్తారు. అయితే బైక్‌ను ప్యాక్ చేయడానికి ఇచ్చే ముందు అందులో పెట్రోల్ లేకుండా చూసుకోవాలి. పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేసిన తర్వాత ఇవ్వకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో.. కొన్ని సందర్భాల్లో లోపల పెట్రోల్ ఉంటే జరిమానా విధించవచ్చు. పార్శిల్ చేసిన తర్వాత రైల్వే శాక ఇచ్చే రశీదులను భద్రంగా ఉంచుకోవాలి.
బైక్ తీసుకునే చోట తిరిగి వాటిని చూపించండి. మీ బైక్ ఏ ట్రైన్‌లో పార్శిల్ చేయబడుతుందో, అది గమ్యస్థానానికి ఎప్పుడు వస్తుందో ముందుగానే అడిగి తెలుసుకోవాలి. సరైన సమయానికి వెళ్లి బైక్‌ను తీసుకోవాలి. కొన్నిసార్లు బైక్ డెలివరీ అయ్యాక కూడా ఆలస్యంగా తీసుకుంటే స్వల్ప జరిమానా ఉండే అవకాశం ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE