రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్

Emmanuel As Chief Guest On Republic Day, Chief Guest On Republic Day, Chief Guest Emmanuel, Republic Day Chief Guest Emmanuel, Republic Day, India, PM Modi, Republic Day Celabrations 2024, Republic Day 2024, India Prime Minister, President Of France, Emmanuel Macron, India, Indian Political News, Mango News, Mango News Telugu
Republic day, India, PM Modi

భారత్‌కు 15 ఆగష్టు 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. 1950లోనే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది.  26 జనవరి 1950న గణతంత్ర దేశంగా భారత్ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీ భారతీయుడు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ప్రతిఏడాది ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కేంద్ర ప్రభుత్వం విదేశీ నాయకులను ఆహ్వానిస్తోంది. మరో నెలరోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుండగా.. ఈ సారి కూడా ఈ వేడుకులకు ముఖ్య అతిథిని ఖరారు చేశారు.

ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేసింది.  ఈ మేరకు ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో జనవరి 26న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ భారత్‌కు రానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రావడం ఇదే మొదటిసారి. ఇక ఇమ్మాన్యుయేల్ భారత్‌కు వస్తే ఐదు నెలల్లో రెండుసార్లు ఇండియాకు వచ్చినట్లు అవుతుంది. ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు కూడా ఇమ్మాన్యుయేల్ హాజరయ్యారు.

అయితే ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల బైడెన్ ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారట. దీంతో ఆతర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడిని వేడుకలకు ఆహ్వానించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =