డిసెంబర్ 2023లో జరిగిన శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. పార్లమెంటు సెక్యూరిటీ బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.దీంతో పార్లమెంటు దగ్గర మొత్తం 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది మోహరించారు.
ఈ 140 మందిలో 36 మంది సీఐఎస్ఎఫ్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారు. జనవరి 31 నుంచి ప్రారంభంకాబోతున్న బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు కాంప్లెక్స్ దగ్గర విజిటర్స్, బ్యాగేజీతో పాటు తనిఖీల బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు.
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి వచ్చి కలర్ స్మోక్ బాంబ్స్ వేసి దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు పార్లమెంటు బయట ఆందోళన చేపట్టడం అప్పట్లో కలకలం రేపింది. దీంతో పార్లమెంట్ భద్రతపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి. దీంతో పార్లమెంటు భవన సముదాయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర హోంశాఖ రివ్యూ మీటింగ్ నిర్వహించింది.
అందులో భాగంగానే భద్రత కోసం సీఐఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ప్రస్తుతం పార్లమెంటులో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ భద్రత కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటిలో కొత్తగా చేరిన సీఐఎస్ఎఫ్.. ఎయిర్ పోర్టు తరహాలో సెక్యూరిటీని అందించనుంది . ఎక్స్ రే మెషీన్స్, డిటెక్టర్స్, స్ర్కీనింగ్ మెషీన్లతో తనిఖీ చేయనున్నాయి.
సీఐఎస్ఎఫ్.. సుమారు 1.77 లక్షల మంది సిబ్బందితో మల్టీ స్కిల్డ్ ఆర్గనైజేషన్ గా ఎదిగింది. కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటున్న కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని సీఐఎస్ఎఫ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 358 కంపెనీలకు భద్రతను అందిస్తుంది. సొంతంగా ఫైర్ వింగ్ ను కూడా కలిగి ఉండటం సీఐఎస్ఎఫ్ ప్రత్యేకత . మొత్తం 114 కంపెనీలకు తమ ఫైర్ సేవలను అందిస్తుంది. ఢిల్లీలోని కొన్ని కేంద్రశాఖల భవనాలతో పాటు 68 పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్ సెంటర్స్, ఢిల్లీ మెట్రో దగ్గర కూడా సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE