రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనివ్వకుండా విజయ్‌కు అడ్డుపడింది ఎవరంటే?

Vijay Prevented from Entering Politics, Vijay Thalapathy, Politics,Thalapathy Vijay, Hero Vijay, VIjay political entry,Tamil actor Vijay's political entry, Tamil Nadu Politics, latest news on tamil nadu politics,latest news tamil nadu politics today,current news in tamil nadu politics,breaking news in tamil nadu politics,Mango News Telugu , Mango News
Thalapathy Vijay, Hero Vijay, VIjay political entry

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. హీరో రజినీకాంత్ ఫాలోయింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా విజయ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనంటే పడిచచ్చిపోయే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. అయితే ఇన్నిరోజుల పాటు సినిమాలతో అలరిస్తున్న విజయ్.. ప్రజాసేవలో కూడా భాగం కావాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని ఎప్పడినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని.. కొత్త పార్టీ పెడుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరగడమే తప్ప.. ఇప్పటి వరకు కూడా అందుకు మహూర్తం రాలేదు. ఎంతో మంది అలా అనుకొని ఇలా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త పార్టీలు స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పదవులను అనుభవిస్తున్నారు. మరి కోట్లాది మంది ప్రజల అభిమానం, అండదండలువున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీకి మాత్రం ముహూర్తం రావడం లేదు. అసలు ఎందుకు ఆలస్యమవుతుంది? విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఎవరు బ్రేకులు వేస్తున్నారన్న ప్రశ్నకు ఇప్పుడు ఓ సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. ఆయన భార్య సంగీతనే విజయ్ రాజకీయాల్లోకి రాకుండా ఇన్నిరోజులు అడ్డుపడ్డారట. ఆయన కుమారుడు జేసన్ సంజయ్‌కి కూడా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదట. విజయ్‌కు మాత్రం రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని.. ప్రజాసేవ చేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నారట. కానీ భార్య, కొడుకు వ్యతిరేకిస్తుండడంతో ఇన్నిరోజులు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకుండా విజయ్ ఆగిపోయారు.

అసలు కొద్దిరోజులుగా విజయ్ తన భార్య సంగీత మధ్య మనస్ఫర్థాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంగీత విజయ్‌కు దూరంగా లండన్‌లో ఉంటున్నారు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థాలు రావడానికి అసలు కారణం కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీనేని తెలుస్తోంది. తన భార్య, కొడుకును ఒప్పించేందుకు కొంతకాలంగా విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇక ఏదిఏమయినప్పటికీ 2026 ఎన్నికలలోగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారట. మరి ఈసారి అయినా విజయ్ ఎంట్రీ ఇస్తారా? లేదా మళ్లీ ఏదైనా బ్రేకులు పడుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =