ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా నమ్ముతున్నా- జో బైడెన్

Biden victory speech, Elect Joe Biden, US election 2020, US election 2020 results, US Election Results, US President, US President Elect Joe Biden, US President Elect Joe Biden Speech, US President Elect Joe Biden Victory, US President Elect Joe Biden Victory Speech

అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి, 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ తొలిసారిగా తన సొంత రాష్ట్రమైన డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ప్రసంగించారు. “అమెరికా దేశ ప్రజలు మాకు స్పష్టమైన విజయాన్ని అందించారు. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యధికమైన 74 మిలియన్ ఓట్లతో గెలిచాము. ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతూ, అమెరికా దేశ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తాం. దేశాన్ని విభజించకుండా ఏకీకృతం చేయాలని కోరుకునే అధ్యక్షుడిగా నేను ప్రతిజ్ఞ చేస్తాను. డెమొక్రాట్ రాష్ట్రాలు మరియు రిపబ్లిక్ రాష్ట్రాల అని వేరుగా చూడకుండా యునైటెడ్ స్టేట్స్ గా మాత్రమే చూస్తాం. గత అధ్యక్షుడు ట్రంప్‌కు ఓటు వేసిన వారందరికీ ఈ రాత్రి నిరాశ కలిగించవచ్చు. అయితే ఇప్పుడు ఒకరికొకరు అవకాశం ఇద్దాం. కఠిన పరిస్థితులను దూరంగా ఉంచి, ఒకరినొకరు మళ్ళీ చూడటానికి, ఒకరినొకరు మళ్ళీ వినడానికి ఇదే సరైన సమయమని భావిద్దాం. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. కలిసికట్టుగా ఉంటే అమెరికన్లు ఏదైనా సాధించగలరు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా నమ్ముతున్నాను” అని జో బైడెన్ పేర్కొన్నారు.

మరోవైపు ముందుగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. “దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాటం చేయాల్సి ఉంటుంది, ఇందుకు త్యాగం అవసరం అవుతుంది, కానీ దానిలో ఆనందం మరియు పురోగతి ఉంది. దేశంలో మంచి భవిష్యత్తును నిర్మించగల శక్తి మాకు ఉంది. ముఖ్యంగా నా గెలుపు మహిళా లోకం సాధించిన విజయం. అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను నేను కావొచ్చు. కానీ, చివరి మహిళను కాదు. ఈ రోజు ఇక్కడ నా ఉనికి కారణం నా తల్లి శ్యామల గోపాలన్ హారిస్. ఆమె 19 సంవత్సరాల వయస్సులో భారతదేశం నుండి ఇక్కడకు వచ్చినప్పుడు, ఇప్పుడు నిజమైన ఈ క్షణాన్ని ఆమె ఊహించలేదు, కానీ అమెరికాను ఆమె లోతుగా నమ్మారు. ఆ క్రమంలోనే ఈ రోజు ఉపాధ్యక్షురాలిగా నేను ఎన్నికయ్యే క్షణం సాధ్యమయింది. అమెరికా చరిత్రలో ఇకపై కొత్త రోజులు ఉండబోతున్నాయి. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఎల్లప్పుడూ అమెరికా ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తారు” అని కమలా హారిస్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =