వీల్‌చైర్‌లో కేసీఆర్ ప్రచారం..

KCR, wheelchair, KCR campaign in wheelchair, BRS, Lok sabha Elections, Telangana, Congress, Lok Sabha Elections , Election Campaign, Telangna, Telangna BJP Party, TRS Party, BRS Party, Mango News Telugu, Mango News
KCR, BRS, Lok sabha Elections, Telangana, Congress

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో నైనా తమ హవా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే మునుముందు మనుగడ కష్టమేననే సూచనలు కనిపిస్తుండడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లు పార్టీ బాధ్యతలు మోస్తూ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినట్లుగానే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

ఈ పరిణామాల మధ్య తెలంగాణలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అంతకంటే ఆసక్తికరమైన ఓ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిలోగా ఎన్నికలు పూర్తయినా ఆశ్చర్యం లేదట. అందుకే వీల్‌చైర్‌లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట గులాబీ బాస్. ఫిబ్రవరి 1న వీల్‌చైర్‌లోనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారట. ఆ తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఫామ్‌హౌజ్‌కు వెళ్లిన కేసీఆర్.. అక్కడే కాలు జరిపడిపోయారు. ఈక్రమంలో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్‌ను పరీక్షించి శస్త్రచికత్స చేశారు. కేసీఆర్‌కు ఎనిమిది నుంచి పన్నెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో కేసీఆర్ అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుంటున్నప్పటికీ.. దాదాపు బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్నారట కేసీఆర్.

అయితే లోక్‌సభ ఎన్నికల ముంగిట కేసీఆర్ బయటికి రాకపోతే తీరని నష్టం వాటిల్లుతుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఈక్రమంలో పూర్తిగా కోలుకోకముందే ప్రచారానికి సిద్ధమవుతున్నారట కేసీఆర్. వీల్‌చైర్‌లోనే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ సభలకు కేసీఆర్ వీల్‌చైర్‌లోనే హాజరు కానున్నారట. అయితే గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇలానే వీల్ చైర్‌లోనే ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. వీల్ చైర్‌లో ప్రచారం చేయడం దీదీకి కలిసొచ్చింది. మరి వీల్‌చైర్‌లో ప్రచారం చేయడం కేసీఆర్‌కు కలిసొస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE