మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను గోదావ‌రి జ‌లాల‌తో అభిషేకం చేయ‌బోతున్నాం – సీఎం కేసీఆర్

Telangana CM KCR Public Speech After Mallanna Sagar Reservoir Inauguration, Telangana CM KCR Public Speech, Mallanna Sagar Reservoir Inauguration, Mallanna Sagar Reservoir, Telangana CM KCR, CM KCR Public Speech After Mallanna Sagar Reservoir Inauguration, Momentous Day in Telangana’s Irrigation History, Telangana’s Irrigation History, Minister KCR, K Chandrashekar Rao, Minister K Chandrashekar Rao, Chief minister of Telangana, Telangana Chief minister KTR, Telangana Chief minister KCR Public Speech After Mallanna Sagar Reservoir Inauguration,, MallannaSagar Inauguration, MallannaSagar Inauguration Latest News, MallannaSagar Inauguration Latest Updates, MallannaSagar Inauguration Live Updates, Mango News, Mango News Telugu,

సీఎం కేసీఆర్ ఈరోజు (బుధవారం) తెలంగాణలోనే అతిపెద్దదైన జ‌లాశ‌యం ‘మల్లన్న సాగర్‌’ రిజర్వాయర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగంగా అభివృద్ధి చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన అనంత‌రం.. ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. “మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ జీవ‌నాడి, ఈ మ‌హాయజ్ఞంలో ప్ర‌తి చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఇంజినీర్లు కూడా ఈ యజ్ఞంలో చేయి కలిపారు. ఇది మ‌ల్ల‌న్న సాగ‌ర్ కాదు, తెలంగాణ జ‌ల‌ హృద‌య సాగ‌రం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మంత్రి హరీష్ రావు ఎంతో చొరవ చూపారు,  అందుకు ఆయనను అభినందించాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..”ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి జ‌లాల‌తో అభిషేకం చేయ‌బోతున్నాం. దీని వలన ఒక్క సిద్దిపేట‌కే కాదు, హైద‌రాబాద్ న‌గ‌రానికి కూడా శాశ్వ‌తంగా త్రాగునీరు అందుతుంది. దీనిని ఆపటానికి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేశాం. రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంపున‌కు గురైన గ్రామాల‌కు న్యాయం చేస్తాం. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్యాయం కానీ, న‌ష్టం కానీ జరుగనివ్వము. భూములు కోల్పోయిన వారి త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది. అందుకే, భూనిర్వాసితుల‌ను తప్పకుండ ఆదుకుంటాం” అని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =