పులివెందుల నుంచే షర్మిల పోటీ?

Sharmila, Pulivendula, Sharmila Contest, YS Sharmila, Congress, CM jagan, YCP, YS Sunitha in Pulivendula, AP CM, CM YS Jagan Mohan Reddy, AP Congress, Andhra Pradesh News Updates, AP Political News, Mango News Telugu, Mango News
Pulivendula, YS Sharmila, Congress, CM jagan, YCP

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని రంగంలోకి దిగారు వైఎస్ షర్మిల. కొద్దిరోజులపాటు అప్పటి కేసీఆర్ సర్కార్‌పై పెద్ద యుద్ధమే చేశారు. తీరా ఎన్నికలొచ్చే సరికి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు. దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నప్పటి నుంచి  షర్మిల విమర్శల బాణాల బాణాలు వదులుతూ వైసీపీ సర్కార్‌కు తూట్లుపొడుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తన సోదరుడు, వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిపైనే పోటీకి సై అంటున్నారు షర్మిల.

అవును పులివెందుల నుంచి పోటీకి షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కడప జిల్లాలో షర్మిల పర్యటించారు. అక్కడ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే కడప తన అడ్డా అని ప్రకటించారు షర్మిల. కడప తన పుట్టినిల్లు అని.. తాను కూడా జగన్ మాదిరిగానే జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పుకొచ్చారు. జగన్‌తో సమానంగా తనకు అన్ని హక్కులూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. కడప బిడ్డలకు అండగా ఉంటానని చెప్పుకొచచ్చారు.

ఈక్రమంలో షర్మిల పులివెందుల నుంచి బరిలోకి దిగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. తన అన్న జగన్‌పై షర్మిల పోటీ చేయబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా పులివెందుల నుంచే పోటీ చేయాలని షర్మిలకు సూచిస్తోందట. పులివెందులనే షర్మిలకు సరైన పోటీక్షేత్రమని చెబుతోందట. ఈక్రమంలో షర్మిల కూడా పులివెందుల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. అందుకే ఇటీవల కడపలో పర్యటించిన షర్మిల.. త్వరలోనే మరోసారి పర్యటించనున్నారట.

మరోవైపు తన సొంత అన్నపై పోటీకి దిగుతున్న షర్మిల.. మరో సోదరుడు అవినాష్ రెడ్డిపై తన సోదరిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ వివేకానంద కుమార్తె సునీతను బరిలోకి దించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారట. తన తండ్రిని చంపించారంటూ అవినాష్ రెడ్డిపై కొద్దిరోజులుగా సునీత పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అవినాష్ రెడ్డిని ఢీ కొట్టేందుకు సునీత కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఆమె హస్తం గూటికి చేరనున్నారట. ఈక్రమంలో ఈసారి కడప గడ్డపై ఎన్నికలు రసరవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE