ఇంద్రవెల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ రెడ్డి

CM Revanth reddy, Telangana Congress, Lok sabha elections, Telangana, Election Campaign, Revanth Reddy, Indravelli, Telangana CM, Telangana Congress, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangana News Live, Telangana News, Mango News Telugu, Mango News
CM Revanth reddy, Telangana Congress, Lok sabha elections, Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టికరిపించి.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను గద్దె నెక్కించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి. ఈసారి మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా.. పక్కా వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకు కదులేందుకు సన్నద్ధమవుతున్నారు.

మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి రేవంత్ రెడ్డి ప్రజాబాట పట్టనున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న.. అమలు చేయబోతున్న పథకాలను అస్త్రాలుగా వాడుకొని.. వాటిని ప్రజలకు వివరించేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో కాకుండా.. మాస్ లీడర్‌గానే జనాల్లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారట.

ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్‌లో ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు 60 నుంచి 65 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. గడప గడపకు తిరిగి సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.

తెలంగాణలో ఈసారి 12 నుంచి 14 లోక్ సభ స్థానాలను దక్కించుకుంటే.. కేంద్రంలో తమ పరపతి పెరుగుతుందని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నారు. అలాగే మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇక తొలి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి వేదికగా లోక్‌సభ ఎన్నికలకు రేవంత్ రెడ్డి శంఖారావం పూరించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − thirteen =