ప‌వ‌న్ కు లేదా ధీమా..! ఎందుకంత సాగ‌దీత‌!!

Pavan kalyan, janasena, ap elections,tdp,Bhimavaram,Pithapuram,CM Jagan,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, assembly elections,andhra pradesh,Mango News Telugu,Mango News
Pavan kalyan, janasena, ap elections

ప‌దునైన డైలాగుల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై  విరుచుకుప‌డుతున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాను పోటీచేసే స్థానం ప్ర‌క‌టించ‌డానికి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఈనేప‌ప‌థ్యంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చ‌విచూసిన ఓట‌మి భ‌యం ఇంకా ఆయ‌న‌ను వెంటాడుతుందా.. అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. భీమ‌వ‌రం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోవ‌డం ఆయ‌న‌నే కాదు.. జ‌న‌సైనికుల‌ను, ప‌వ‌న్ అభిమానుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. గ‌తం నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుని ఆచితూచి అడుగులు వేస్తున్న జ‌న‌సేనాని.. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్నా.. ఇంకా తాను పోటీచేయ‌బోయే స్థానంపై దోబూచులాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒకేసారి 99 స్థానాలతో టీడీపీ – జ‌న‌సేన ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేశ్ పోటీచేయ‌బోయే స్థానాలు ఉన్నాయి. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోటీచేయ‌బోయే స్థానం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం వెనుక వ్యూహం ఉందా.. లేక ఆయ‌న డైల‌మా లో ఉన్నారా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవల ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించినా అందులో ప‌వ‌న్ పేరు లేదు.

మొన్న‌టివ‌ర‌కు చారు. భీమవరం అన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం మార‌డం కూడా సందేహాలు నెలకొన్నాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పోటీకి పవన్‌ మొగ్గుచూపినట్లు జ‌న‌సేన‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రావలసి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్‌ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్‌ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైుంది. పవన్‌ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్‌, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది.

కాగా.. పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొనసాగుతున్నారు. ఈయనకు బలమైన నేతగా పేరుంది. అయితే పిఠాపురం సీటును తొలుత జనసేన కోరినప్పుడు వర్మను దృష్టిలో ఉంచుకుని వేరే నియోజకవర్గాన్ని అడగాలని టీడీపీ కోరింది. కానీ జనసేన ఈ సీటుపై పట్టుబట్టడం, అది కూడా స్వయంగా పవన్‌ పోటీచేయాలని నిర్ణయించడంతో టీడీపీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. మ‌రోవైపు వ‌ర్మ కూడా ప‌వ‌న్ అయితే అభ్యంత‌రం లేద‌ని, వేరే వ్య‌క్తికి ఇస్తే ఇండిపెండెంట్ గా అయినా బ‌రిలోఉంటాన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. ప‌వ‌న్ పిఠాపురం నుంచి నామినేష‌న్ వేస్తే చాలు.. గెలుపు బాధ్య‌త తాము తీసుకుంటామ‌ని కూడా చెప్పిన‌ట్లు స్థానిక టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నించే ప‌వ‌న్ అక్క‌డి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారా తెలియాల్సి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నిక‌ల పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇప్ప‌టికీ.. ప‌వ‌న్ పోటీ చేసే స్థానంపై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంపై ఆయ‌న గెలుపుపై ధీమా లేక‌నే ఆలోచిస్తున్నార‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ