బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు నేడే ప్రారంభం, సభ్యులు వీళ్లేనా?

Bigg Boss Season 4, bigg boss season 4 contestants, bigg boss season 4 contestants list, bigg boss season 4 in telugu, Bigg Boss Season 4 Telugu, bigg boss season 4 telugu contestants, bigg boss telugu 4, Bigg Boss Telugu Season 4, bigg boss telugu season 4 contestants, bigg boss telugu season 4 contestants list, BIGG BOSS Telugu Season 4 Starts, BIGG BOSS Telugu Season 4 Starts From Today

తెలుగు టీవీ ప్రేక్షకులను గత 3 సీజన్లలో ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు సోమ‌వారం నుండి శుక్రవారం వ‌ర‌కు రాత్రి 9.30 గంటలకు, శ‌ని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. బిగ్‌బాస్ మొదటి సీజన్లో శివబాలాజీ, రెండో సీజన్లో కౌశల్, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. మూడు సీజన్స్ లో బిగ్‌బాస్ లో పాల్గొన్న సభ్యులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. నాలుగో సీజన్ తో కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్టు చెబుతున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగులో పాల్గొనే సభ్యులపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే బిగ్‌బాస్ లో పాల్గొనేది వీళ్ళేనంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దేత్తడి హారిక, నోయల్‌, జబర్దస్త్‌ అవినాష్‌, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, హీరోయిన్ మోనాల్‌ గుజ్జార్‌, దర్శకుడు సూర్యకిరణ్, యాంకర్ లాస్య, యాంకర్ దేవి నాగవల్లి, ‌గంగవ్వ, మెహబూబ్‌ దిల్‌సే,‌ అరియానా గ్లోరీ, సోహైల్‌ రియాన్‌, తనూజ పుట్టస్వామి, కరాటే కల్యాణి సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు గాని, నిర్వాహకులుగాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే సభ్యులకు ముందుగానే పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ లో ఉంచారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారినే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నేడు మొదలయ్యే బిగ్‌బాస్ 4 తెలుగు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =