జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభకు ఎప్పటిలాగే విశేష స్పందన లభించింది.ఈ సభలో 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తామని, అలాగే పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇస్తామని జనసేన అధినేత పవన కళ్యాణ్ తెలిపారు.రైతులకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కోనసీమలో రైలు కూత వినిపించేలా చేస్తామని ,పోలవరాన్ని పూర్తి చేస్తామని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.కష్టం విలువ తెలిసినవాడినని, నరసాపురంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నరసాపురంలోనే చదువుకున్నారన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.
అదే సందర్భంలో.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి జోలికి రావొద్దని.. ఆయన అజాత శత్రువు అని పవన్ అన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉంటారో వేరే పార్టీలో ఉంటారో అన్నది ఆయన ఇష్టమన్న పవన్..వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడినైన తానే ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు.
చిరంజీవి జోలికి, రాష్ట్ర ప్రజల జోలికి కానీ రావొద్దని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సజ్జల గారూ అంటూ పవన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల అందరి ట్యాక్స్ సొమ్ము సజ్జల తింటున్నారని..ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని చెప్పిందని అన్నారు. సజ్జల రాజకీయాల గురించి మాట్లాడకూడదని పవన్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారు పాలసీల గురించి బాగుంది అంటే అప్పుడు ఆయన మంచివారా? జనసేనకు 5 కోట్లు విరాళం ఇవ్వగానే.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వగానే చిరంజీవి చెడ్డవారు అయిపోయారా అని ప్రశ్నించారు. చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా ఏం చేయలేరు, సింహం సింగిల్ గా వస్తుందని సజ్జల కామెంట్లు చేయడం ఎంతవరకూ సమంజసం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY