భూమి గురించి ఈ విషయాలు తెలుసుకుందాం

Today is International Earth Day, Earth Day, Earth Day 2024, International Earth Day, Earth, Earth Is Also The Only Planet, Earth's plates, Formation Of Mountains, Earthquakes, Volcanic Eruptions on Earth, Earth News, Nature News, Mango News, Mango News Telugu
International Earth Day,Earth,Earth is also the only planet, Earth's plates, formation of mountains, earthquakes , volcanic eruptions on Earth

ప్రతీ ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డేను  నిర్వహిస్తారు. 1970లో ఏప్రిల్ 22న  అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న  హానిపై తమ నిరసన గళాన్ని విప్పారు. దానికి గుర్తుగా..  ఈ తేదీని ఎర్త్ డేగా ఐక్యరాస్యసమితి ప్రకటించింది.

ఈ సందర్భంగా భూమి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా భూమిని మ్యాప్‌లలో సంపూర్ణ గోళాకారంలో చూపిస్తారు. కానీ ధ్రువాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది. కాబట్టి భూమిని  ధ్రువాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు.

ఇతర గ్రహాల లాగానే సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరగడం వల్ల భూమిపై కూడా గురుత్వాకర్షణ శక్తి, అపకేంద్ర బలం గట్టిగా పని చేస్తాయి. దీని వల్ల ధ్రువాలు కాస్త సమతలంగా ఉండటంతో పాటు భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎక్కువగా ఉంటుంది.

భూమిపై దాదాపు మూడొంతులు ఉండేది నీరే. భూమిపై  ఘన, ద్రవ, వాయు రూపాల్లో నీరు  ఉంటుంది. హిమాలయాలు , సరస్సులు, నదులు, సముద్రాలు, మహా సముద్రాల రూపంలో ఈ నీరు ఉంటుంది. ఈ మొత్తం నీటిలో 97 శాతం సముద్రాల్లో ఉప్పు నీటి రూపంలోనే ఉంటుంది.

భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం మొదలవుతుంది. భూమి వాతావరణం, అంతరిక్షంల మధ్య రేఖను కార్బన్ రేఖగా పిలుస్తారు. సముద్ర తలం నుంచి వంద కిలో మీటర్ల ఎత్తులో ఇది మొదలవుతుంది.

సౌర కుటుంబంలో ఐదో అతిపెద్ద గ్రహంగా, అత్యధిక సాంద్రత గల గ్రహంగా భూమి ఉంది. సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి మధ్యలో ఒక ఇనుప గోళం ఉందని దీని వ్యాసార్థ్యం దాదాపు 1,200 కిలో మీటర్లు అని భావిస్తున్నారు. దీనిలో ఎక్కువ శాతం ఉక్కు ఉంటుంది. అలాగే మన విశ్వంలో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి..ఇందులో ప్రస్తుతం దాదాపు 12 లక్షల జంతువులను పరిశోధకులు గుర్తించారు.

భూమి సంపూర్ణ గోళాకారంలో లేకపోవడంతో పాటు ద్రవ్యరాశి  అన్నిచోట్లా ఒకేలా ఉండకపోవడంతో గురుత్వాకర్షణ క్షేత్రంలో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అందుకే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది.

ఉపరితలం కింద ఫలకాలు కదులుతున్న ఏకైక గ్రహం కూడా భూమి. భూఫలకాల కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపం నిత్యం మారుతూ ఉంటోంది. ఈ కదలికల వల్లే  భూమిపై పర్వతాలు ఏర్పడటం, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతాయి.

సూర్యుడి నుంచి వచ్చే ఆవేశపూరిత రేణువుల నుంచి భూమి మాగ్నటిక్  ఫీల్డ్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. భూమి కేంద్రం నుంచి మొదలయ్యే ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =