భర్త బీజేపీ అభ్యర్థి, భార్య ఇండిపెండెంట్..

Husband and Wife Competition at One Place in Bellary, Husband and Wife Competition at Bellary, Husband and Wife Competition, Bellary, Husband is a BJP Candidate, Wife is an Independent, Bhagyalakshmi, Sriramulu, Bellary Politics, Bellary Seat, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Husband and wife competition, Bellary , Husband is a BJP candidate, wife is an independent,Bhagyalakshmi, Sriramulu,

కర్ణాటకలో రెండో దశలో జరగబోతున్న బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎలక్షన్స్ నామినేషన్‌ పత్రాల సమర్పణ గడువు ముగిసిపోయింది. అయితే నామినేషన్ పత్రాల సమర్పణ ఫస్ట్ డే బీజేపీ అభ్యర్థిగా బి.శ్రీరాములు నామినేషన్ వేయగా.. ఈ తర్వాత  శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడం హాట్ టాపిక్ అయింది.

బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చినా కూడా.. ఎన్నికల అధికారులు తన నామినేషన్‌ను తిరస్కరిస్తారని మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు టెన్షన్ పడ్డారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్య భాగ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.అయితే ఇప్పుడు శ్రీరాములు, శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి ఇద్దరి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఆమోదించారు. దీంతో భాగ్యలక్ష్మి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరి నామినేషన్ పత్రాలు ఉప సంహరణ రోజు  భాగ్యలక్ష్మి పోటీలో ఉంటుందో.. భర్త కోసం తప్పుకుంటుందో తెలుస్తుంది.  లోక్‌సభ ఎన్నికలకు వందలాది మంది నామినేషన్లు వేయగా.. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి  పదకొండు మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు అమోదించారు. 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల వివరాలను బళ్లారి జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు.

బళ్లారి సిటీ కలెక్టరేట్‌లోని ఈసీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇ.తుకారాం, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వాల్మీకి కృష్ణప్ప, బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు, శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మితో సహా  మొత్తం 11 మంది నామినేషన్ పత్రాలను ఆమోదించామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు.

జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నామినేషన్ పత్రాలన్నీ కూడా క్రమబద్ధంగా ఉన్నాయని మిశ్రా వివరించారు. ఇవే కాకుండా కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సి. చెన్నవీర,  ప్రహార్ జనశక్తి పార్టీ అభ్యర్థి మంజప్ప, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా  పార్టీ అభ్యర్థి ఎ. దేవదాస్, నవభారత్ సేన అభ్యర్థి జి. స్వామి వారి నామినేషన్ పత్రాలు కూడా సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే మొత్తం మీద నామినేషన్ పత్రాల ఉపసంహరణ రోజు  మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకుంటారా లేక పోటీలో ఉంటారా  అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఆమె కనుక నామినేషన్ ఉపసంహరించుకోకపోతే బళ్లారి రాజకీయాలు రంజుగా మారుతాయని బళ్లారి ప్రజలు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =