
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదేనంటే కాదు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఏపీలో కీలక నియోజకవర్గం అయిన ఉండిలో.. ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఉండిలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తుండగా వైఎస్సార్సీపీ తరపున పెనుమత్స వెంకటలక్ష్మి నరసింహారాజు బరిలో ఉన్నారు. అక్కడ తెలుగు దేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదని.. రఘురామకు చంద్రబాబు టికెట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు రఘురామ గెలుపును సంక్లిష్టంలో పడేసింది.
రఘురామ టికెట్ విషయంలో తమను సంప్రదించకుండా ఏకపక్షంగా టీడీపీ అధినేత నిర్ణయం తీసుకోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 2009,2014లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా పని చేసిన కలవపూడి శివకు 2019లో టీడీపీ నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వగా.. వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన రఘురామకృష్ణ రాజుగెలుపొందారు.
అయితే ఈసారి ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో పాటు, కలవపూడి శివ టికెట్లను ఆశించారు. . కానీ వీరిద్దరిని పక్కన పెట్టిన చంద్రబాబు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు టికెట్ ఇచ్చారు. దీంతో టీడీపీ కేడర్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంది.
అధినేత తీరుపై ఆగ్రహించిన కలవపూడి శివ.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో.. ఇది రఘురామ గెలుపుపై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నర్శింహరాజు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఉందని..అలాగే జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎటు చూసినా.. రఘురామకు ఈ ఎన్నికల్లో భంగపాటు జరగక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY