
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరికొకరు చేరికలను ప్రోత్సహిస్తూ తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు.. ఇలా ఏ కార్యక్రమం చేసినా అందులో చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కూటమి నేతలకు వైసీపీ.., అధికార పార్టీ నేతలకు కూటమి వల వేస్తున్నాయి. ప్రత్యర్థి బలం తగ్గించడం ద్వారా తమ బలం పెంచుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బడా నాయకులు సభలు, సమావేశాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
అభ్యర్థులు, చోటామోటానాయకులు కొందరు రహస్యంగా ప్రత్యర్థులతో భేటీ అయి నచ్చచెబుతుంటుంటే, మరికొందరు నేరుగా వారి వద్దకు వెళ్లి తమపార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదే క్రమంలో బి.కొత్తకోట సింగిల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ కాపు నేత తిరుమల అమరనాథ్‌తో కూటమి అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు మంగళవారం భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు బి.కొత్తకోటలో పర్యటించిన వారు స్థానిక నాయకుల సూచన మేరకు కొద్దిమంది అనుచరులతో అమరనాథ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను అమరాథ్ సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపు వారితో రాజకీయ పరిస్థితి పై ముచ్చటించారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
దీనిపై అమరనాథ్ సానుకూలంగా స్పందించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి తరఫున ప్రచారం చేస్తూ, అకస్మాత్తుగా వైసీపీ నేతతో భేటీ కావడం రాజంపేట లోక్‌సభ పరిధిలో చర్చనీయాంశం అయింది. ఇదే తరహాలో ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఫలానా నేత.. ప్రస్తుతం ఉన్న పార్టీపై కాస్త అసంతృప్తిగా ఉన్నాడని తెలిస్తే చాలు.. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆ ఇంట్లో వాలిపోతున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఎలాగున్నా.., లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు రసవత్తరంగా మారుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY