కరోనా మందు పంపిణీ చేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : ఆనందయ్య

Anandaiah, Anandaiah Gives Clarity Over Distribution of Ayurvedic Medicine, Anandaiah Gives Clarity Over Distribution of Ayurvedic Medicine at Krishnapatnam, Anandaiah Krishnapatnam, Ayurvedic Medicine at Krishnapatnam, Ayurvedic medicines forCOVID-19 put on hold, Corona Ayurvedic Medicine at Krishnapatnam, Covid 19 Ayurvedic Medicine at Krishnapatnam, Krishnapatnam, Krishnapatnam Ayurvedic Medicine, Krishnapatnam Ayurvedic Medicine Live Updates, Krishnapatnam Ayurvedic Medicine News, Mango News

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా ఆయుర్వేద మందుపై పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మందు పంపిణీని నిలిపివేశారు, వచ్చే సోమవారం నాడు మందు పంపిణీకి సంబంధించి తుదినిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయుర్వేద మందు పంపిణీ మళ్ళీ ప్రారంభమైనట్టు వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

“ఈ మధ్య మందు తయారుచేయడం ఆపేసి ఉంది. ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన వెంటనే మందు తయారుచేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తాను. సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం నుంచి మందు పంపిణీ చేస్తునట్టు ప్రచారం జరుగుతుంది. అదంతా అబద్దం, ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ప్రస్తుతం మందు తయారీకి అవసరమైన వనమూలికలు, ద్రవ్యాలు వంటి ముడి పదార్థాలు సిద్ధంగా లేవు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే అందరికి తెలిసేలా ప్రకటన చేసి, అందరికి మందు పంపిణీ చేస్తానని మనవి చేసుకుంటున్నాను” అని ఆనందయ్య పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =