
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయింది. నేతలంతా ప్రచారాలు, తమ పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ బిజీ అయిపోయారు. ఎవరికి వారే తమ పార్టీని గెలిపించి.. తాము పవర్లోకి రావడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు తమ తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేయడంతో ఒకరి లోటుపాట్లను మరొకరు హైలెట్ చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. దీనికి తోడు ఏపీలోనూ ఇప్పుడు పోటీ చేసే అన్ని పార్టీల మేనిఫెస్టోలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అయితే ఫస్ట్ నుంచీ తనకు తానే హైలెట్ చేసుకుంటూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
మేనిఫెస్టోలు, ప్రచారాల రేసులో తాను కూడా ఉన్నానంటూ తమ పార్టీ మేనిఫెస్టోతో పాల్ ముందుకు వచ్చారు. ఈ సారి విశాఖ పట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ తరపునుంచి దశరత్నాలు పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే ఇది మక్కీకి మక్కీ వైసీపీని ఫాలో అయినట్లు ఉందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఏపీ సీఎం జగన్ నవరత్నాల పేరు పెట్టగా.. పాల్ దశ రత్నాలు పేరుతో తన మేనిఫెస్టోను విడుదల చేశారు. దీంతో పాల్ హామీలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకెందుకు సొంతంగా మేనిఫెస్టో తయారు చేయడం, వైసీప మేనిఫెస్టోను జిరాక్స్ లు తీసి పంచేయాల్సిందిగా అంటూ పంచ్ డైలాగులు
మేనిఫెస్టో పేరు మాత్రమే కాదు. డిజైన్ విషయంలోనూ వైఎస్సార్సీపీనే ఫాలో అయ్యారు పాల్. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. పది గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రకటించారు. పాల్ మేనిఫెస్టోలో.. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం, కేజీ టూ పీజీ ( ఇంగ్లీష్, తెలుగు మీడియం) ఉచిత విద్య, నెలకు 25వేలకు తక్కువ లేకుండా జీతంతో వంద రోజుల్లోనే ఉద్యోగ కల్పన, నిరుద్యోగ యువతకు నెలకు 6 వేల రూపాయలు నిరుద్యోగ భృతి, వితంతు మహిళలకు నెలకు 5 రూపాయల పింఛన్, ప్రతీ మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం, మత్స్య కార , రైతులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం వంటి హామీలతో పాల్ తమ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY