
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 3 దశలలో ఎన్నికల పోలింగ్ పూర్తవగా.. మే 13 న 4 వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అధికారుల విధులు, ఈవీఎం మిషన్లల తరలింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక బీఎల్ఓ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతీ నియోజకవర్గంలో ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు అందిస్తున్నా కూడా కొందరికి ఓటర్ స్లిప్‌లు అందని పరిస్థితిని ప్రతీ ఎన్నికలలో చూస్తూనే ఉంటాం.
బీఎల్ఓ అధికారులు..ప్రతీ ఓటరుకు కూడా ఓటర్ స్లిప్ అందించడానికి క్షేత్రస్థాయి నుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే చివరి నిమిషంలో కొంతమందికి ఓటర్ స్లిప్పులను అందించే పరిస్థితి ఉండదు. ఇలా ఓటరు స్లిప్ అందని వారిలో కొంతమంది తమ ఓటు హక్కను వినియోగించుకోరు. కానీ ఓటు ప్రతి ఒక్కరి ఆయుధం అని.. ఓటు హక్కును వినియోగించుకోకపోతే అది ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్లే అవుతుందని అధికారులు అంటున్నారు.
ఓటర్ స్లిప్స్ అందని వారు దానిని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ ఓటర్ స్లిప్‌పై ఓటరు పేరు, క్యూఆర్ కోడ్ వంటి ఓటర్ యొక్క వివరాలు ఉంటాయి. ఓటర్ స్లిప్‌పై ఓటరు పేరుతో పాటు వారి వయసు, లింగం, అసెంబ్లీ నియోజవకవర్గం, పోలింగ్ స్టేషన్ లొకేషన్, పోలింగ్ బూత్ నంబర్, పోలింగ్ తేదీతో పాటు సమయం ఉంటాయి.
ఈ వివరాలతో పాటు ఆ ఓటర్ స్లిప్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఓటరు వివరాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడానికి.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐ యాప్ ద్వారా కానీ, వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ వంటి సదుపాయాలను కూడా వాడుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY