ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.88 శాతం పోలింగ్ నమోదు

2021 AP Municipal Elections, 62.88 Percent Polling Reported in AP Municipal Elections, Andhra Pradesh Municipal Corporation elections, Andhra Pradesh Municipal elections, Andhra Pradesh Municipal Polls, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections 2021 LIVE, AP Municipal Elections 2021 News, AP Municipal Elections News, AP Municipal Elections Polling, AP Municipal Elections Polling Live Updates, AP Municipal Polls, AP Municipal Polls 2021, Mango News, Municipal Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12 కార్పొరేషన్లకు మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.88% పోలింగ్ ‌నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 75.93 శాతం పోలింగ్ నమోదు కాగా, కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 14 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:

  • తూర్పుగోదావరి: 75.93
  • ప్రకాశం: 75.49
  • శ్రీకాకుళం: 71.52
  • నెల్లూరు: 71.06
  • విజయనగరం: 68.22
  • అనంతపురం: 66.11
  • కడప: 65.01
  • చిత్తూరు జిల్లా: 62.21
  • పశ్చిమగోదావరి: 62.02
  • గుంటూరు: 61.77
  • కృష్ణా: 61.31
  • విశాఖపట్నం: 56.83
  • కర్నూలు: 55.87
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − six =